రాబోయే 10 రోజుల్లో ఏo జరగబోతుంది?
ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, స్పెయిన్, అమెరికా, చైనా.. ఇప్పటివరకు హై రిస్క్ ఉన్నట్లుగా ప్రకటించబడిన దేశాలు.. ఆ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం కత్తి మీద సాము లాంటిదే.. అయినా ఆ సాము చెయ్యక తప్పని పరిస్థితి. అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుండడంతో అడ్డుకట్ట వెయ్యడానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించాయి ప్రభుత్వాలు. విమానాల్లో వచ్చే వారిని క్వారంటైన్‌కు తరలించడం. తరచూ వారి నమూనాలు సేకరించి పరీక్షించడం. హైరిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చిన వారైతే వారిని గుర్తించి, ఆ వ్యక్తి ఉన్న ఇంట్లో సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించి వైద్య పరిశీలన చేయించడం.. ఎవరైనా సహకరించకపోతే వారిని నిర్బంధించి క్వారంటైన్‌కు తరలించడం. ఇదంతా చాల కష్టతరమైందే.. అయితే పది రోజులు ఎందుకు లాక్ డౌన్ అంటున్నాయి ప్రభుత్వాలు. పది రోజులకు వైరస్ నాశనం అయిపోతుందా? లేకపోతే వైరస్‌కు మందును కనుక్కొంటారా? అసలు పది రోజులే ఎందుకు జనాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి.
Post a Comment